NBK 108 : బాలయ్య మూవీలో పాట కోసం రూ.5 కోట్లతో భారీ సెట్

-

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “NBK 108” అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తోంది.

షైన్ స్క్రీన్స్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ధి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ మునుపేన్నడు పోషించని పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ తో పాటు అనిల్ రావిపూడి తాలూకు కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ మూవీలో ఒక పాట చిత్రీకరణ కోసం రామోజీ ఫిలిం సిటీలో రూ.5 కోట్లతో సెట్ వేసినట్లు తెలిసింది. గణేశుడికి సంబంధించిన ఓ పాటను బాలయ్య, శ్రీ లీలతో ఈసెట్ లోనే గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారట. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న పాట ఇదేనని చిత్రబృందం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news