భార్య సపోర్ట్ తో మైనర్ బాలికపై భర్త అత్యాచారం

-

భర్తకు ఓ యువతి నచ్చింది. దీంతో భర్త ఆ విషయాన్ని భార్యకు చెప్పాడు. అలా చెప్పడం తప్పని చెప్పాల్సిన భార్యనే.. ఆ యువతిని ఇంటికి పిలిపించింది. భర్తతో యువతిపై అత్యాచారం చేయించింది. భార్యే దగ్గరుండి వీడియో తీసి ఎంకరేజ్ చేసింది. ఇలాంటి దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బదౌన్‌లో ఓ కుటుంబం నివాసముంటోంది. ఆ ఇంటి పక్కనే ఓ మైనర్ బాలిక నివాసముంటుంది. తెలిసిన వారు కావడంతో ఆ బాలిక తరచూ వీరి ఇంటికి వెళ్లేది. అయితే ఈ క్రమంలో సదరు మహిళ భర్త కన్ను బాలికపై పడింది. దీంతో బాలికపై అత్యాచారం చేయడానికి సాయం చేయాలని కోరాడు.

అత్యాచారం-మైనర్ బాలిక
అత్యాచారం-మైనర్ బాలిక

దీనికి అంగీకరించిన భార్య.. మైనర్ బాలికను ఇంటికి పిలిపించింది. బాలిక ఇంటికి రాగానే గదిలో వేసి బంధించింది. అనంతరం భర్త.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. భార్య పక్కనే ఉంటూ ఎంకరేజ్ చేసింది. ఫోటోలు, వీడియోలు తీసింది. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారు. అయితే రెండు రోజుల తర్వాత నిందితులు ఆ వీడియోను సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. దీంతో భయపడిన బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ మేరకు తల్లిదండ్రులకు పోలీసులు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news