పెద్దాపురంలో భార్య గొంతు కోసి మృతదేహాన్ని పాతిపెట్టిన భర్త

-

కొందరు భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. కానీ సడన్ గా ఏదో ఒక చిన్న విషయంపై వారి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అంతవరకు ఒకరి కోసం ఒకరు ప్రాణమిచ్చే వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోతారు. మరికొందరు ప్రాణాలను తీయడానికి సైతం వెనకాడరు. తాజాగా ఇలాంటి ఘటనే కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దాపురంలో భార్య గొంతు కోసి మృతదేహాన్ని పాతిపెట్టాడు భర్త పాపారావు.

భార్య బున్నీ ని దారుణంగా హత్య చేశాడు భర్త పాపారావు. వీరికి గత 4 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో వీరిద్దరూ కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తుంది మృతురాలు. భర్త.. తాను మారిపోయానని నమ్మించి బైక్ పై భార్య బున్నీ ని తీసుకొని వెళ్ళాడు.

తర్వాత బున్నీ ని చంపి పాతిపెట్టి భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల నుంచి బున్ని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే భర్త పాపారావు పై పోలీసులకు అనుమానం రావడంతో విచారణ చేపట్టారు. దీంతో బున్నీని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు భర్త. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news