‘కారు’ చిచ్చు..కేసీఆర్ డైరక్ట్ ఎటాక్?

-

ఎక్కడైనా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు జరగడం సహజమే…అధికారం చెలాయించాలని ఎవరికి వాళ్ళు చూస్తారు….ఈ క్రమంలో ఒకే నియోజకవర్గం కావొచ్చు, ఒకే జిల్లా కావొచ్చు…సొంత పార్టీ నేతల మధ్యే విభేదాలు నడుస్తాయి. అయితే  ఈ పోరు ఓ లిమిట్ లో ఉంటే బాగానే ఉంటుంది…కానీ ఎప్పుడైతే లిమిట్ దాటుతుందో…అప్పటినుంచే రచ్చ మొదలవుతుంది. అంతర్గత పోరు కాస్త బయటపడుతుంది..నేతలు వీధికెక్కి తగులాడుకునే పరిస్తితి వస్తుంది.

ప్రత్యర్ధి పార్టీలపై విరుచుకుపడాల్సిన నేతలు…సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడతారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో జరిగే రచ్చ ఇదే. ఎప్పుడైతే ఇతర పార్టీల నుంచి నేతలు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వచ్చారో అప్పటినుంచి రచ్చ మొదలైంది.  అయితే ఎక్కువ మంది నేతలు రావడం వల్ల టీఆర్ఎస్‌కు ఎంత లాభం జరిగిందో..ఇప్పుడు అంతే నష్టం జరిగేలా ఉంది.

ఇప్పుడు ఎక్కడకక్కడ నేతల మధ్య వార్ నడుస్తోంది. అయితే ఈ ఆధిపత్య పోరుని కేటీఆర్ పాజిటివ్ గా తీసుకుంటున్నారు. మా పార్టీలో సీట్ల కోసం పోటీ పెరిగిందని చెప్పుకుంటున్నారు. పోటీ పెరిగేది పర్లేదు…కానీ ఒకరినొకరు ఓడించుకునేంత కోపం కూడా నేతలకు వస్తుంది. ఒకరికి టికెట్ ఇస్తే..మరోకరు సహకరించే పరిస్తితి లేదు…పైగా ఓడించడానికి చూస్తారు. ఇది ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీకి డేంజర్. అసలే బీజేపీ పుంజుకుంటున్న సమయంలో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరు పార్టీకి డ్యామేజ్ చేస్తుంది.

అయితే ఈ ఆధిపత్య పోరుకు టీఆర్ఎస్ అధిష్టానం పూర్తి స్థాయిలో చెక్ పెట్టే కార్యక్రమం చేయలేదు. ఏదో కేటీఆర్ అప్పుడప్పుడు కొందరు నేతలని సముదాయించడం తప్ప. ఇక ఇప్పుడు మరింతగా రచ్చ పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ డైరక్ట్ గా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 3న శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత ఏ ఏ స్థానాల్లో ఆధిపత్య పోరు ఉందో..ఆయా స్థానాల నేతలకు క్లాస్ పీకడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. నేతలకు సర్ది చెప్పి, అందరూ కలిసి పనిచేసేలా ఆదేశించనున్నారు. మరి కేసీఆర్ డైరక్ట్ ఎటాక్ చేసి…టీఆర్ఎస్ లో అంతర్గత పోరు తగ్గుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news