ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. రేపు సమీక్ష సమావేశంలో యాసంగి లో అమలు చేయవలసిన నిర్ణీత పంట సాగు విధానంపై అలాగే గ్రామంలో పంట కొనుగోలు అంశాలపై మాట్లాడబోతున్నారు. ఇక ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ తో పాటు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు, సీనియర్ ఆఫీసర్ లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఏ పంట వేస్తె మంచిది…? ఏ పంట వేయకూడదు….? ఏ పంట వేస్తే వచ్చే లాభనష్టాల వంటి అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు.
దీనితో పాటు రాష్ట్రంలో మొక్కల పెంపకం పై కూడా సమీక్ష పోతున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా గత యాసంగి పంటలను గ్రామాలలో కొనుగోలు చేసినట్టుగానే వర్షాకాల పంటలను కూడా గ్రామాలలో కొనుగోలు చేసే విషయంపై కేసీఆర్ చర్చించబోతున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఆరువేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… పంటలను కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.