తెలంగాణలో ఆగని లోన్ యాప్ ఆగడాలు..మరో యువకుడి ఆత్మహత్య..న్యూడ్ ఫోటోలు రిలీజ్ చేయడంతో !

-

తెలంగాణ రాష్ట్రం లో లోన్ యాప్ ఆగడాలు… ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం లో 9 నెలల్లో 150 లోన్ యాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా కొత్త కోట కు చెందిన శేఖర్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. చైనీస్ లను అరెస్ట్ చేసినా, కాల్ సెంటర్ లను కొల్లగొట్టినా ఈ ఆగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇక తాజాగా లోన్ యాప్ ఆగడాలకు మరో యువకుడు బలయ్యాడు. సోమవారం సూసైడ్ నోట్ రాసి ఆత్మ హత్య కు పాల్పడ్డాడు శేఖర్ అనే యువకుడు. లోన్ యాప్ నిర్వహకుల వేదింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నట్టు లేఖ రాశాడు శేఖర్‌. 2000 లోన్ తీసుకున్న శేఖర్ ఫోటో ను మార్ఫ్ చేసి న్యూడ్ ఫోటో ను కాంటాక్ట్ లో ఉన్న అందరికీ పంపారు లోన్ యాప్ నిర్వాహకులు. దీంతో ఆ అవమానం భరించలేక ఆత్మ హత్య చేసుకున్నాడు శేఖర్.

Read more RELATED
Recommended to you

Latest news