రాజస్థాన్ లో దారుణం.. బాలికపై ముగ్గురు అన్నదమ్ములు గ్యాంగ్ రేప్

-

దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. ప్రతి రోజు ఏదో ఓ మూలన… మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ని కఠినమైన నిర్నయాలు, చట్టాలు అమలు చేసినా.. ముర్ఖులకు బుద్ది రావడం లేదు. ఇంకా రెచ్చి పోయే ప్రవర్తి స్తున్నారు. అయితే.. తాజాగా రాజస్థాన్‌ బార్మర్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.

ఓ బాలికపై కన్నేసిన ఓ పోస్ట్‌ మాస్టర్‌ ఆమెను మాయ మాటలతో నమ్మించి ఫంక్షన్‌ ఉందంటూ ఆమెను బలవంతంగా తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి చేశాడు. నిజం చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత ఆ బాలికను తన సోదరుడికి అప్పగించాడు.

ఆమెను ఇంటి వద్ద దిగబెడతానని వెంటబెట్టుకుని వెళ్లిన అతడు జోధ్‌ పూర్‌ లోని ఓ ఇంట్లో బంధించి.. నెలన్న రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. ఆ తర్వాత తన ఇద్దరు సోదరులతో కలిసి.. అందరూ కలిసి… ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఎలాగో వారి నుంచి తప్పించుకుని వచ్చిన బాలిక విషయాన్ని తన సోదరుడికి చెప్పింది. దీంతో నిందితులపై బాలిక ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారి కోసం గాలింపు చర్చలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news