రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించిన అమెరికా… ఆల్కాహాల్, డైమండ్ దిగుమతులు బంద్

-

ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై మరిన్ని ఆంక్షలు విధింపు కొనసాగుతోంది. ఇప్పటికే అమెరికా, యూరోపియన్ దేశాలు, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. తమ గగనతలం నుంచి రష్యా విమానాలను నిషేధించాయి. ఇదిలా ఉంటే చాలా మల్టీనేషనల్ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను రద్దు చేసుకున్నాయి. యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, కొకాకోలా, పెప్సీ, పూమా వంటి కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను బంద్ చేసుకున్నాయి. 

ఇదిలా ఉంటే తాజాగా అమెరికా మరికొన్ని ఆంక్షలను విధించింది. రష్యా, దాని మిత్రదేశం బెలారస్ లకు లగ్జరీ వస్తువును ఎగుమతిని నిషేధించింది. రష్యాన్ ఓడ్కా, ఆల్కాహాల్, సీ ఫుడ్, నాన్ ఇండస్ట్రియల్ డైమండ్స్ దిగుమతిని నిషేధించింది. దీంతో రష్యా మరింత ఆర్థిక సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల దాదాపుగా 25 లక్షల మంది శరణార్థులు ఉక్రెయన్ ను వదిలి ఇతర దేశాలకు వలస వెళ్లారని అమెరికా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news