హాస్టల్‌లో చదువుకుంటూ బిడ్డకు జన్మనిచ్చిన మైనర్‌ బాలిక.. 

-

చదువుకుంటూ పుస్తకాలు మోయాల్సిన వయసులో ఓ బాలిక కడుపులో బిడ్డను మోయాల్సిన పరిస్థితి వచ్చింది.. ప్రసవం అయ్యేవరకూ ఆ బాలిక గర్భవతి అయిన ఎవరికీ తెలియదు.. తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఇందుకు ఒక కారణం.. ఇది జరిగింది దిల్లీ, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లో కాదు.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమ్మయ్య జిల్లాలోనే.. జిల్లాలోని వాల్మీకిపురంలోని జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న మైనర్ బాలిక ప్రసవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం వరదయ్యపాలెంకు చెందిన 14ఏళ్ల బాలిక వాల్మీకిపురంలోని జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. హాస్టల్‌లో కడుపు నొప్పి వస్తోందని చెప్పడంతో బాలికను వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మైనర్ బాలిక గర్భవతి అని గుర్తించారు. అక్కడే మగబిడ్డను ప్రసవించింది. బిడ్డను స్వాదీనం చేసుకొన్న ఐసీడీసీ అధికారులు విద్యార్థిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఇంత జరుగుతున్న హాస్టల్ సిబ్బంది, అధికారులు, తల్లిదండ్రులకు తెలియకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది.. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ హాస్టల్ సిబ్బంది, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు.
హాస్టల్‌లో చదువుకుంటూ తల్లైన మైనర్ బాలిక సొంత ఊరు తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెం. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం తిరుపతికి వచ్చి శ్రీ సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వరదయ్యపాలెంలో నివాసం ఉంటున్నారు. మైనర్ బాలికను తాత, అమ్మమ్మల దగ్గర సోమలలో ఉంటూ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నట్లుగా డీసీఓ తెలిపారు. బాలికను ఆరవతరగతిలో హాస్టల్‌లో చేర్పించారు. 9తరగతి చదువుతుండగానే తల్లిగా మారింది. బాలికకు ప్రతి నెల పీరియడ్స్‌ రాకపోవడం, నాఫ్కిన్స్‌ తీసుకునే లిస్టులో మైనర్ బాలిక పేరు లేకపోవడంతో హాస్టల్ సిబ్బంది ఎన్నోసార్లు తల్లిదండ్రులకు చెప్పినట్లుగా డీసీఓ తెలిపారు. వారు కూడా స్పందించి పిరియడ్స్ రావడం కోసం వైద్యం చేయించారు కానీ మిగతా ఎటువంటి పరీక్షలు చేయించని కారణంగానే గర్భం దాల్చడం..బిడ్డను కనడం జరిగిందన్నారు. అయితే అమ్మాయిలో ఎలాంటి మార్పులు కనిపించకపోవడం వల్లే తాము గుర్తించలేక పోయామని హాస్టల్‌ సిబ్బంది చెప్పుకొస్తున్నారు..
ఈ వార్త తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేసి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించామని డీసీఓ పేర్కొన్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అయితే మైనర్‌ను గర్భవతిని చేసింది ఎవరూ అనే విషయం ఇంకా తెలియరాలేదు.. ఎంత దారుణం అసలు ఇది.. ఆ పసివయసులో బాలిక ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది.. ఎవరు చేశారో కూడా తెలియకపోవడం ఏంటో.. పైగా ఈ ఘటనపై అందర్ని ప్రవర్తన అనుమానంగానే ఉంది.. ఘటన జరిగినప్పుడు బాలికకు తెలియలేదా..? బాలిక తప్పుందా.? ఎవరి నిర్లక్ష్యానికి ఎవరు బలైపోయారో..

Read more RELATED
Recommended to you

Latest news