యాసిడ్ దాడులు, అత్యాచారాలు, ఎదిరిస్తే ముక్కలు ముక్కులుగా నరికివేయడం గత కొద్దిరోజులుగా ఇవి నిత్యకృత్యాల్లా జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో దారుణ ఘటన జరిగింది. ఓ బాలికను 12 గంటలకు పైగా గ్యాంగ్ రేప్ చేశారు. గత శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం మధ్య ఈ ఘాతుకం జరిగింది. 8 మంది నిందితులు ఆ బాలికను ఎత్తుకెళ్లి ఖాళీగా ఉన్న ఓ భవనంలో 12 గంటలకు పైగా రేప్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
డిసెంబర్ 16 రాత్రి 8 గంటలకు మొదలైన ఈ దారుణం తర్వాతి రోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగిందని.. బాధిత బాలిక తెలిపింది. ఆ తర్వాత ఆ బాలికను సముద్ర తీరంలోని పొదల్లోకి తీసుకెళ్లి ఆ దుండగులు మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డారట. పల్ఘార్ జిల్లాలోని సత్పతి పోలీస్ స్టేషన్‍లో ఈ గ్యాంగ్ రేప్ కేసు నమోదైనట్టు పాల్ఘర్ రూరల్ పోలీస్ స్టేషన్‍కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. పోక్సో, గ్యాంగ్ రేప్ సహా మొత్తం ఆరు ఐపీసీ సెక్షన్ల కింద ఆ 8 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
మరోటి..
కోల్‍కతాలోనూ ఓ పాశవిక ఘటన జరిగింది. ఓ మైనర్ బాలిక రేప్ కేసులో 18 ఏళ్ల యువకుడిని, అతడి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను ఇంటికి పిలిచి ఆ మహిళకు మత్తుమందు ఇచ్చి.. అనంతరం ఆ యువకుడు మూడు రోజుల పాటు ఆ బాలికపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాలిక ఆ ఇంట్లో నుంచి తప్పించుకొని, తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. అక్టోబర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రేప్ కేసులో ఆ మహిళను, యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.. బయటపడేవి కొన్నే.. అవే మనకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.