ప్రముఖ కోలీవుడ్ నటుడి హోటల్లో రైడ్..కారణం..?

-

చెన్నైలో నటుడు సూరి హోటల్లో తాజాగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించడం జరిగింది. కోలీవుడ్ నటుడు సూరి గురించీ మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాస్య పాత్రలు చేసే స్థాయి నుంచి కథానాయకుడిగా ఎదిగిన నటుడు సూరి మధురైలో పలు ప్రాంతాలలో సొంతంగా అమ్మన్ పేరుతో కొన్ని హోటల్స్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇతర హోటల్స్ తో పోల్చుకుంటే వినియోగదారులకు సూరీ నడుపుతున్న అమ్మన్ హోటల్స్ లో తక్కువ ధరకే నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తున్నారనే పేరు కూడా ఉంది. ఇకపోతే ఈ అమ్మన్ హోటళ్లపై వాణిజ్యపన్నుల అధికారులు తాజాగా తనిఖీలు చేశారు. ఇక ఆ ప్రాంతంలోని ఇతర హోటల్లో నిర్వాహకుల ఫిర్యాదుల కారణంగా మంగళవారం సాయంత్రం అధికారులు సోదాలు నిర్వహించారు.

ఇకపోతే ఆ హోటల్లో వినియోగిస్తున్న ఆహార పదార్థాలు.. కొనుగోలు చేస్తున్న సరుకుల గురించి సేకరాలు వివరాలు సేకరించారు. ఇకపోతే హోటల్లో విక్రయిస్తున్న ధరల పట్టికలను కూడా తనిఖీ చేసి జీఎస్టీ పన్ను చెల్లించడం లేదనే విషయాన్ని కూడా వెలుగులోకి వచ్చింది. ఇక దీంతో హోటల్ నిర్వాహకులపై అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా సూరి హోటళ్లపై తనిఖీల ఘటన కోలీవుడ్లో పలు చర్చలకు దారితీస్తోంది. ఇకపోతే ఈ మేరకు కోలీవుడ్ నటుడు సూరి ఎలాంటి నిర్ణయం తీసుకొని స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

ఇకపోతే కోలీవుడ్ హాస్యనటుడు సూరి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే . ఈయన నటించిన ఎన్నో తమిళ్ చిత్రాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవడం వల్ల ఆయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడు అయ్యాడు.ఇకపోతే తాజాగా ఇలా అమ్మన్ హోటల్స్ పై వాణిజ్య పన్నుల అధికారులు రైడ్ జరపడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా అలాగే సినీ ఇండస్ట్రీలో ఈ వార్తలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. మరి ఈ విషయంపై సూరి ఎలా స్పందిస్తారు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news