హైతీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పై వెళ్తునటువంటి ఇంధన ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. తీర నగరం మిరాగానేలో జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 25 మందికి పైగా మరణించనట్టు సమాచారం. మరో 50 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. రోడ్డు పై వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ టైరు తొలుత పంక్చర్ కావడంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలడంతో ప్రమాదం తీవ్రతరంగా మారింది.
పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్ లో తరలించారు. ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు. ఇది చాలా భయంకరమైన ప్రమాదమని.. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పని చేస్తున్నాయని తెలిపారు. హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగ్ ల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే.. నౌకలను ఎక్కువగా వాడుతుండటం గమనార్హం. ఈ ప్రమాదం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకోవడం విశేషం.