నాదృష్టిలో యోధుడు అంటే పవన్ కళ్యాణ్ : తేజ సజ్జా

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది గా ను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా హనుమాన్. ఈ మూవీ ఎటువంటి అంచనాలు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి ఈ ఏడాది ఇప్పటివరకు టాలీవుడ్‌లో రిలీజై మిట్ అందుకున్న టాప్ 1 మూవీగా రికార్డ్ ను సృష్టించింది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు హీరో తేజ సజ్జ కు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కిన విషయం తెలిసిందే. ఇటీవల తేజ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మీరాయ్‌ పేరుతో రిలీజ్ అయిన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇంకా ఈ క్రమంలోనే తేజ సజ్జ ఓ ఈవెంట్ లో పాల్గొన్నా రు. వారు అడిగే ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఇండస్ట్రీలో సూపర్ యోధ అనే టైటిల్ను ఇండస్ట్రీలో వ్యక్తికి ఇవ్వాలనుకుంటే మీరు ఆ బిరుదు ఎవరికి ఇస్తారు. అంటూ తేజను ఓ వ్యక్తి ప్రశ్నించారు.టాలీవుడ్ లో సూపర్ యోధుడు అంటే పవన్ కళ్యాణే.పోస్టర్ కళ్యాణ్‌గారి స్టైల్ తగ్గట్టు పవన్ కళ్యాణ్ కు సూపర్ యోధ అనే టైటిల్ అయితే బాగా సెట్ అవుతుంది అని నా ఒపీనియన్ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news