రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న ‘ఆర్టికల్ 370’ మూవీ

-

జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే డైరెక్షన్ లో బాలీవుడ్ న‌టి యామి గౌతమ్ ,ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ సినిమా ‘ఆర్టికల్ 370’.ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది.బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. కొత్త సంవత్సరంలో వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన జాబితాలో నాలుగోస్థానం సొంతం చేసుకుంది. ఈ సినిమాని జియో స్టూడియోస్, స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఆదిత్య ధ‌ర్ నిర్మించాడు.ఈ చిత్రం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు మరియు ఆర్టికల్ 370 ప్రకారం మంజూరు చేయబడిన స్వయంప్రతిపత్తిపై ఆధారపడింది.

ఇదిలా ఉంటే… ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో సినిమా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ మూవీ ఏప్రిల్ 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా, ఈ చిత్రం విడుద‌ల కాక‌ముందే ప్ర‌ధాని నరేంద్ర మోడీ కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే ‘ఆర్టికల్ 370’ లాంటి సినిమాలను చూడాలని తెలిపిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news