ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు.షుగర్ లెవెల్స్ పెరిగేలా జైల్లో అరవింద్ కేజీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. ‘వాటి వల్ల బ్లడ్ షుగర్ పెరిగితే బెయిల్ అడగాలనేది కేజీవాల్ ప్లాన్’ అని పేర్కొంది.అయితే, ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ సీఎం హత్యకు జైల్లో పథకం రచిస్తు్న్నారని ఆరోపించింది.
షుగర్ లెవెల్స్ పెరిగేందుకు జైల్లో కేజీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారనేది పచ్చి అబద్ధమని ఆప్ మంత్రి ఆతిశీ మండిపడ్డారు .’కేజీవాల్ తన షుగర్ లెవల్ను తగ్గించుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారు. ఇంటి భోజనాన్ని తీసుకోవడానికి ఆయనకు కోర్టు అనుమతినిచ్చింది. కానీ బీజేపీ ఈడీ సహాయంతో ఇంటి భోజనాన్ని ఇవ్వకుండా ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేయడానికి ప్రయత్నిస్తోంది’ అని ఆమె ఆరోపించారు.