భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..సెక్స్‌ చేస్తుండగా !

-

ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి, ఖమ్మంలో చికెన్ వ్యర్ధాలు తరలించే వాహన డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కోనిజర్ల మండలానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆయన ఖమ్మం రోటరీనగర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే, కొంతకాలం కిందట ఆమెకు భర్తతో కలిసి పనిచేసే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించడంతో ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది.

దీంతో ఆమె ప్రియుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి యువతి భర్తకు ఈనెల 1 న ఫోన్ చేసి పిలిపించి మద్యం తాగించాక శ్రీనివాస్ నగర్ – అగ్రహారం ప్రాంతంలో హత్య చేయడమే కాక, చికెన్ వ్యర్ధాల వాహనంలో తీసుకెళ్లి కృష్ణాజిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలోని చెరువులో పడవేసినట్లు సమాచారం. ఆ తరువాత సదరు యువతి ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయం బయటపడినట్లు తెలిసింది. ఇక ఈ కేసు వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news