ప్రేమ పేరుతో దగ్గరై.. ఆ వీడియోలు చూపిస్తూ… చివరికి..!

ఈ మధ్యకాలంలో ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న దారుణాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అనే విషయం తెలిసిందే. ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పడం ఆ తర్వాత శారీరక మానసిక అవసరాలు తీర్చుకుని చివరికి నట్టేట ముంచేయడం లాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది ఒంటరిగా ఉన్న మహిళా పై కన్నేసిన ఒక మోసగాడు మాయమాటలతో మహిళను నమ్మించి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి జరిగింది అన్న విషయాన్ని దాచి చివరికి మహిళలను శారీరకంగా వాడుకొని.. చివరికి గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ చేయించాడు.

ఈ దారుణ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది, ఆ తర్వాత పెళ్లి చేసుకో మని సదరు మహిళ ఒత్తిడి చేయడంతో మొహం చాటేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. అంతేకాదు సదరు మహిళ తో ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నాడు చివరికి బాధితురాలు ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నది, ప్రస్తుతం పరారీలో ఉన్న సదరు యువకుడుని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.