ఆధార్, పాన్ కార్డులు ప్రతీ ఒక్కరికీ చాలా అవసరం. అయితే, ఎప్పుడైనా మీరు మీ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు పోగొట్టుకుంటే మళ్లీ వాటిని పొందడానికి పెద్ద ప్రాసెస్ ఉండేది. అయితే ఆధార్ కార్డు తిరిగి పొందడం మరింత సులభతరం అయింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
- ఆధార్ కార్డు పోగొట్టకున్న వాళ్లు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://uidai.gov.in/ వె సైట్‌లో గెట్ ఆధార్‌పై ట్యాప్ చేసి ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అప్పుడు ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి అందులో వివరాలను నమోదు చేయాలి. వెంటనే మన రిజిస్టర్ట్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.
- కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు కోసం రూ.50 డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత మీకు వచ్చే ఎస్‌ఆర్‌ఎన్ నెంబర్ సేవ్ చేసుకోండి.
- ఆర్డర్ చేసిన రెండు వారాల తర్వాత మీకు కొత్త పీవీసీ ఆధార్ కార్డు ఇంటికి వస్తుంది. పాన్ కార్డును పోగొట్టుకున్నట్లయితే.. పాన్ కార్డులను జారీ చేసే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ ఎస్‌డీఎల్) అధికారిక వెబ్‌సైట్ నుంచి పాన్ కార్డును మరల పొందవచ్చు.
- యూటీఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ https://www.utiitsl.com/ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘పాన్ కార్డ్ సర్వీసెస్’ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత వెంటనే మరో వెబ్‌పేజీకి ఓపెన్ అవుతుంది. అందులో ‘డౌన్ లోడ్ ఇ–పాన్’ పై క్లిక్ చేసి,
- అందులో మీ పాన్ కార్డు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. క్యాప్చా వివరాలను సబ్మిట్ చే యాలి.
- తర్వాత మెయిల్ ఐడీ లేదా రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌పై లింక్ వస్తుంది. లింక్ పై క్లిక్ చేయగానే ఓటీపీ వస్తోంది. ఓటీపీని ఎంటర్ చేసి ఈ పాన్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.