ఆధార్ కార్డు మనకి చాలా ముఖ్యమైనది. ఆధార్ ఎన్నో వాటికి అవసరం అవుతుంది. ఏదైనా స్కీమ్స్ మొదలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వరకు ఆధార్ చాలా ముఖ్యం. అయితే మనం ఏదైనా మార్పులు చేసుకోవాలన్న కూడా ఆధార్ లో చేసుకో వచ్చు. ఇక మరి ఎలాంటి మార్పులు ఆధార్ లో చెయ్యచ్చు..?, ఎన్ని సార్లు చెయ్యచ్చు అనేవి చూద్దాం.
ఆధార్ కార్డు లో మన పేరును రెండుసార్లు మాత్రమే మార్చడానికి అవకాశం ఉంటుంది. అలానే డేట్ ఆఫ్ బర్త్ ని అయితే కేవలం ఒక్కసారి మాత్రమే అప్డేట్ చెయ్యాలి. ఒక్కోసారి ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. ఆధార్ అప్డేట్ కోసం రిక్వెస్ట్ పెట్టుకో వచ్చు. యూఐడీఏఐ రీజనల్ ఆఫీసుకు వెళ్లి ఆమోదం పొందవచ్చు.
జెండర్ వివరాలను కూడా ఒక్కసారే మార్చాలి. ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రత్యేక వెసులుబాటును పొందొచ్చు. ఆధార్ సెంటర్ లో రిక్వెస్ట్ పెట్టుకుని మార్చుకోచ్చు. తర్వాత యూఐడీఏఐ సెంటర్ కు వెళ్ళాలి.
ఎంత పే చెయ్యాలి అనేది చూస్తే.. డెమోగ్రాఫిక్ అప్డేట్ కి అయితే రూ. 50 వసూలు చేస్తారు. బయోమెట్రిక్ అప్డేట్ ఉంటే వంద రూపాయిలు తీసుకుంటారు. బయోమెట్రిక్‌తో పాటు డెమోగ్రాఫిక్ అప్డేట్ వున్నా వంద చెల్లించాలి.