ఆధార్ అడ్రస్ ని ఇంట్లోనే మార్చుకోవచ్చు…!

-

లాక్ డౌన్ లో ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేయడం అనేది చాలా కష్టం. లాక్ డౌన్ సమయంలో చాలా వరకు ఇప్పుడు ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండటం లేదు. మరి ఆధార కార్డ్ ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి…? మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలి అంటే సేవా కేంద్రానికే వెళ్ళాలి అని ఏమీ లేదు. కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు కామన్ సర్వీస్ సెంటర్లకు అనుమతి కూడా ఇచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

20,000 సెంటర్లలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ స్పెషల్ పర్పస్ వెహికిల్‌లో భాగంగా ఆధార్ అప్‌డేషన్ ఫెసిలిటీ మొదలుపెడతారు. ఆధార్ అప్‌డేషన్ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేందుకు, అనుమతులు తెచ్చుకునేందుకు కామన్ సర్వీస్ సెంటర్లకు జూన్ వరకు గడువు కూడా ఇచ్చింది. ప్రైవసీ, డేటా సెక్యూరిటీపై ఆందోళనలు రావడంతో 2017 సెప్టెంబర్‌లో ఈ సేవలు ఆపేశారు.

ప్రస్తుతం విధి విధానాల ప్రకారం చూస్తే కామన్ సర్వీస్ సెంటర్లతో పాటు బ్యాంక్ బ్రాంచ్‌లు, పోస్ట్ ఆఫీసులు, యూఐడీఏఐ ఆథరైజ్డ్ సెంటర్లలో పౌరులు ఆధార్ సంబంధిత సేవలు పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలి అనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా అడ్రస్ ఎలా అప్‌డేట్ చెయ్యాలి అంటే సంబంధిత వెబ్ సైట్ ని సందర్శించాలి.

Read more RELATED
Recommended to you

Latest news