“పండుగాడు” కోసం ఎప్పుడూ రెడీ అంటున్న పూరి జగన్నాధ్ ..?

-

అన్నయ్యా …పండుగాడు కావాలా…! ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకవుద్దో ఆడే పండుగాడు. ఈ డైలాగ్ పూరి రాసిన డైలాగ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ సినిమా 75 సంవత్సరాల రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. ఎవరూ ఊహించని విధంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా పూరి జగన్నాధ్, మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఏ ఒక్కరు కూడా అంతగా నమ్మలేదు. పూరి మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమానా …? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు.

View: Puri's Comments on Mahesh Babu. Who's Right?

అయితే అందుకు కారణం ఈ కథ ని పూరి అప్పటికే పవన్ కళ్యాణ్, రవితేజ లకి చెప్పాడు. కాని ఎందుకనో వాళ్ళు ఈ సినిమాని చేద్దాం చూద్దాం అన్న మాటే తప్ప ముందుకు రాలేదు. ఇక మరో కారణం పూరి సినిమాలో హీరోలు మరీ మాస్ గా ఉంటారన్న సంగతి తెలిసందే. కాని మహేష్ బాబు అప్పటి వరకు ఆ రేంజ్ మాస్ హీరోగా నటించలేదు. దాంతో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఈ కాంబినేషన్ అనగానే రక రకాల కామెంట్స్ చేశారట. ఇక ఈ సినిమా కథ విన్నాక మహేష్ బాబు కి పోకిరి అని టైటిల్ చెప్పగానే కూడా కాస్త భయపడ్డాడట.

కాని కథ పరంగా పూరికి ఫ్రీడం ఇచ్చి అదే టైటిల్ ని ఫైనల్ చేశాడు. ఫైనల్ గా ఈ సినిమా రిలీజయ్యాక సెన్షేషనల్ హిట్ ని సాధించింది. రికార్డులు తిరగరాసింది. దాంతో అప్పటి నుంచే ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని అనుకున్నారు. అయితే అది మాత్రం కుదరనప్పటికి పూరి మహేష్ కాంబినేషన్ లో బిజినెస్ మాన్ వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మూడో సినిమాగా “జనగణమన” అన్న టైటిల్ తో అనుకున్నప్పటికి ఈ ప్రాజెక్ట్ కుదరడం లేదు. ఈ మద్యలో పూరికి మహేష్ కి విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. కాని తాజా సమాచారం ప్రకారం పండుగాడు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అని పూరి చెప్పినట్టు తెలుస్తుంది. అంటే అది పోకిరికి సీక్వెల్ కావొచ్చు లేదా జనగణమన కావచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news