తెలంగాణాలో లాక్ డౌన్ విషయంలో కేసీఆర్ ఆలోచన ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. లాక్ డౌన్ ని ఆయన కొనసాగించాలి అని కోరే అవకాశం లేదా ఎత్తివేయమని కోరే అవకాశం ఉందా అనేది అర్ధం కావడం లేదు. తెలంగాణా లో ప్రస్తుతం కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. మొన్నటి వరకు డబుల్ డిజిట్ లో నమోదు అయిన కరోనా కేసులు ఇప్పుడు సింగిల్ డిజిట్ లో నమోదు అవుతున్నాయి.
మొన్న రెండు కేసులు నమోదు కాగా నిన్న ఆరు కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసీఆర్ సర్కార్ చాలా వరకు ఊపిరి పీల్చుకుంది అనే చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం మూడు ప్రాంతాల్లోనే కేసులు ఉన్నాయి. 22 జిల్లాల్లో గ్రీన్ జోన్ ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే రెండు మూడు రోజుల్లో అసలు కేసులు బయటకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. దేశంలో తెలంగాణాలోనే కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయి.
అయితే ఆయన ఒక కోరిక కోరే అవకాశం ఉంది. రాష్ట్రాల సరిహద్దులను, దేశీయ విమానాలను తెలంగాణా రానీయకుండా చూడాలి అని, ఏపీ, మహారాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసి వేస్తామని కోరే అవకాశం ఉంది కేంద్రాన్ని అని అంటున్నారు. రోజు కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలు ఈ రెండు కూడా. అందుకే లాక్ డౌన్ విషయంలో ఇప్పుడు కేసీఆర్ ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని చూస్తున్నారు.