మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ వలన ఎన్నో లాభాలు వున్నాయి. అయితే ఆధార్ ని అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఆధార్ ని అప్డేట్ చేసుకోవడానికి పే చెయ్యాల్సి వుంది. అలానే ఆధార్ కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కూడా మనం ఫిర్యాదు చెయ్యచ్చు. ఆధార్ కార్డు కి సంబంధించి సమస్యలు ఉంటే ఎవరికీ కంప్లైంట్ చెయ్యాలో చాలా మందికి తెలియదు.
దానితో సమస్యలను పరిష్కారించేందుకు కూడా అవ్వదు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కంప్లైంట్స్ ని కలెక్ట్ చేస్తోంది. వీటిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా పరీశిలించి పరిష్కరిస్తోందిపరిష్కరిస్తోంది. ఈ కంప్లైంట్స్ ని ఫోన్ కాల్, చాట్ బాట్, ఇమెయిల్, వెబ్‌సైట్, పోస్ట్ ద్వారా పంపచ్చు. దానితో ఈజీగా సమస్య తొలగిపోతుంది.
యూఐడీఏఐ 1947 నెంబర్‌ను ఏర్పాటు చేసింది. ఇలా సమస్యను సాల్వ్ చెయ్యచ్చు. యూఐడీఏఐ ఆస్క్ ఆధార్ పేరుతో ఛాట్ బాట్ ఏర్పాటు చేసింది. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఛాట్‌బాట్ అందుబాటులో ఉంది. లేదంటే మీరు https://resident.uidai.gov.in/ వెబ్‌సైట్ కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చెయ్యచ్చు. [email protected] మెయిల్ ఐడి కి కూడా మెయిల్ చెయ్యచ్చు. ఇలా సులభంగా కంప్లైంట్ చేసి సమస్యని సాల్వ్ చేసుకోవచ్చు.