రైతులకి అలర్ట్.. రైతుబంధుకు గడువు అయ్యే లోగా దరఖాస్తు చేసుకోండి..!

-

రైతుబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా రైతులకి ఆర్ధిక సహాయాన్ని అందిస్తోంది. యాసంగి సీజన్‌కి సంబంధించి ఈ నెల 28 నుంచి రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చెయ్యాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతిలోపు రైతులందరీ ఈ డబ్బులు జమ కావాలని కేసీఆర్ ఆదేశించారు.

ఇందుమేరకు ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావును కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 29 నుంచి రైతుబంధు డబ్బులు జమ చెయ్యనున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లా రైతులకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రైతులు జనవరి 7లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారు రైతుబంధు పొందేందుకు దరఖాస్తు చేసుకోమని చెప్పారు.

బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం మరియు ఇతర పత్రాలని తీసుకు వెళ్లి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. సరిగ్గా పత్రాలని సమర్పిస్తేనే స్కీమ్ బెనిఫిట్స్ ని పొందగలరు. ప్రస్తుతం రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య 1.72,877గా ఉంది. గడువు ఎక్స్టెండ్ చేసారు కనుక మరి కొంత మంది ఈ స్కీమ్ లో చేరుతారు. మొత్తం 68 లక్షలకుపైగా రైతులకు రూ.7,600 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేయనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news