ఆధార్, పాన్ లింక్ అయిందో లేదో చూడాలా..? అయితే ఇలా చెక్ చేసేయచ్చు..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు ఎన్నో వాటికి అవసరం అవుతుంది. ఆధార్ కార్డు కనుక లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. అయితే 2023 మార్చి 31లోగా పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలి. ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా ఇదే అంటోంది.

ఇప్పటికే చాలా సార్లు పాన్ కార్డు ని ఆధార్ కార్డు ని లింక్ చేసుకోమని చెప్పింది. అయితే ప్రతీ ఒక్కరు కూడా పాన్ కార్డు ని ఆధార్ కార్డు ని లింక్ చేసుకోవాలి. లేదు అంటే మార్చి 31 తర్వాత పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుంది. ఆధార్ కార్డు, పాన్ అనుసంధానం చేసుకోకపోతే తప్పక లింక్ చేసుకోండి.
అయితే ఆధార్ పాన్ లింక్ అయిందో లేదో అనే కన్ఫ్యూజన్ లో మీరు ఉంటే… ఇలా ఈజీగా చెక్ చేసేయచ్చు. మరి ఇక పూర్తి వివరాల లోకి వెళితే….

దీని కోసం మొదట మీరు ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ వెబ్ సైట్ www.incometax.gov.in కు వెళ్లాల్సి వుంది.
నెక్స్ట్ ‘లింక్ ఆధార్ స్టేటస్’ మీద నొక్కండి.
పాన్ కార్డు నంబర్, ఆధార్ కార్డు నంబర్ ని ఇచ్చేయండి.
ఇప్పుడు వ్యూ లింక్ ఆధార్ స్టేటస్‌ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయ్యాయో లేదో కనపడుతుంది.
ఒకవేళ కనుక లింక్ అవ్వకపోతే లింక్ చెయ్యండి.
అయితే ఈ గడువు ఎప్పుడో అయిపోవడంతో రూ.1000 ఆలస్య రుసుం చెల్లించాలి.
మార్చి 31లోగా పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చెయ్యకపోతే పాన్ కార్డు యాక్టివ్‌లో ఉండదు గుర్తు పెట్టుకోండి.

 

Read more RELATED
Recommended to you

Latest news