జిహెచ్ఎంసి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. డిసెంబర్ 6న ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 కు మీడియాతో మాట్లాడనున్నారు ఎన్నికల కమిషనర్ పార్థసారథి. ఇక ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. ఎలా అయినా గెలిచి తమ పట్టు నిరూపించుకోవాలని అధికార టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంటే, ఏదైనా చేసి గెలిచి తమ పార్టీ ఇంకా బతికే ఉందని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బిజెపి కూడా గ్రేటర్లో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇక టిడిపి కూడా వీలైనన్ని సీట్లు గెలుచుకుని తమ పార్టీ బతికి ఉంది అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. మరి చూడాలి ఈ ఎన్నికలు ఏ పార్టీకి ఉపయోగపడుతుంది అనేది. మరి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తే పార్టీలు అన్నీ ప్రచారంలో బిజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.