ప్రభాస్ ‘ఆదిపురుష్’కి సీత దొరికేసింది..కృతికి వెల్కం చెప్పిన యూనిట్ ! 

-

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకున్నారు. ముందు రాధే శ్యాం సినిమా చేస్తున్న ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా అనౌన్స్ చేసిన కొద్దిరోజులకి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాని అనౌన్స్ చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక వీటన్నిటిలో ఆది పురుష్ సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సీతగా నటించేది ఎవరు అనే చర్చ చాలా రోజులుగా జరుగుతూ వచ్చింది. చాలా రకాల పేర్లు కూడా వినిపించాయి. చాలా ప్రచారాల అనంతరం ఈ సినిమాలో సీతగా  నటించేది కృతి సనన్ అని తేల్చారు. ఈరోజు అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. ఆమెతో పాటు సన్నీ సింగ్ ని యూనిట్ లోనికి ఆహ్వానిస్తున్నామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news