కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జూలై నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24వ తేదీన ముగియనుండటంతో.. ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.ఈ మేరకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించారు.
జూన్ 22 న విపక్ష పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపారు. శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తృణమూల్‌కు యశ్వంత్ సిన్హా రాజీనామా చేశారు. అయితే నేడు ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపింది ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ.ద్రౌపది ముర్ముని గౌరవిస్తాము ,కానీ యశ్వంత్ సిన్హాకు ఓటు వేస్తాము అని తెలిపింది.