ఢిల్లీ మేయర్ పీఠం కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ

-

ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన మేయర్ ఎన్నికలలో 34 ఓట్ల తేడాతో బిజెపి పై ఆప్ విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభ్యర్థి షల్లీ ఓబెరాయ్ ఢిల్లీ నూతన మేయర్గా ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలలో 10 మంది నామినేటెడ్ ఎంపీలు, 14 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలు, మొత్తం 250 కౌన్సిలర్లలో 241 మంది ఓటు వేశారు.

కాంగ్రెస్ నుంచి గెలుపొందిన 9 మంది కౌన్సిలర్లు ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా.. అందులో షెల్లీ ఒబెరాయి కు 150 ఓట్లు, బిజెపి అభ్యర్థి రేఖ గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. దీంతో ఆప్ నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని ఆప్ నేతలు తెలిపారు. సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తానని.. సభ సజావుగా జరిగేలా నేతలందరూ సహకరించాలని ఈ సందర్భంగా మేయర్ షెల్లి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news