తల్లికి నెగిటివ్‌.. ఊపిరి పీల్చుకున్న ఆమీర్ ఖాన్..!

-

ముంబైలో క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండవం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో సామాన్యులు, సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇటీవలే తన సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కుటుంబ సభ్యులందరికీ నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ ఫలితం వచ్చిందని అయితే తన తల్లికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఆమీర్ ఖాన్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా.. ఆమీర్ ఖాన్ తల్లికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమిర్ ఖాన్ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమీర్ తన అమ్మకు కోవిడ్-19 టెస్టుల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయిందని, దీంతో తనకు ఎంతో ఊరట లభించినట్టయిందని ట్విట్లో పేర్కొన్నారు. అలాగే తన తల్లి క్షేమంగా ఉండాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news