జగన్ మాస్కులకు.. నిజాం పాలనకు పొంతేలా ? 

-

ఏమాటకామాట చెప్పుకోవాలి అంటే… వైకాపా అధినేత జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ ఒక వర్గం మీడియా చేస్తున్న విన్యాశాలు, ఇస్తున్న విశ్లేషణలు రకరకాలుగా ఉంటున్నాయి అనే విమర్శలు రెగ్యులర్ గా వస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రస్తుత పాలనకంటే… నిజాం దార్శనికతే గొప్ప అన్న రేంజ్ లో కథనాలు వండి వడ్డించేస్తున్నారు ఆర్కే! ఆ కథనం చూసినవారు మాత్రం… పీక్స్ కి చేరిందా అన్న అనుమానాలు వ్యక్తపరచడం కొసమెరుపు అన్న సంగతి అలా ఉంచితే… ఇంతకూ ఈ విశ్లేషణలొ ఆర్కే పేర్కొన్న సంగతులు ఇలా ఉన్నాయి!

విషయానికొస్తే… ఏపీలో ఉన్న ఐదుకోట్ల పైగా జనాభాకు ఒక్కొక్కరికీ మూడు చొప్పున సుమారు 16కోట్ల మాస్కుల పంపిణీ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయంపై ఆర్కే తెగ ఫీలయిపోతున్నారు! ఇలాంటి అవాంచనీయ నిర్ణయాలతో వందల కోట్లు ఖర్చు చేయడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. దానికి ఆయన చెప్పిన కారణం ఏమిటయ్యా అంటే… రాష్ట్రంలో అంతా పేదలు కాదు కాబట్టి… పేదలు కానివారికి కూడా ఉచితంగా మాస్కులు ఎందుకు ఇవ్వాలి? దానివల్ల రాష్ట్రానికి ఎంత ఆర్థిక నష్టం? అనేది ఆయన ఫీలింగ్ పాపం!

ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించాలా… లేక మాస్కులు అందించేటప్పుడు కూడా తెల్లరేషన్ కార్డు, ఇన్ కం సర్టిఫికెట్టూ చూసి ఇవ్వాలా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పేదవారికి ప్రభుత్వం రేషన్ ఇస్తుంటే… క్యూలో నిలబడి తెచ్చుకుని తిని ఉంటున్నారు. మిగిలినవారు కాస్త చికెన్ లు మటన్ లు తెచ్చుకుని తింటూ ఉండి ఉండొచ్చు! అలాంటి విషయాల్లో ధనిక, పేద తారతమ్యాలు ఆలోచిస్తే పర్లేదు కానీ… డబ్బున్నవారికి, పేదలకు కూడా మార్కెట్లో మాస్కులు దొరకడం కష్టంగా ఉన్న సమయంలో… మాస్కుల విషయంలో కూడా ఇన్ కం సర్టిఫికెట్లు ఎలా పరిశీలిస్తాం… ఆరోగ్యం విషయంలో, పైగా ఇలాంటి పరిస్థితుల్లో అంతా సమానమే అనే ఆలోచన చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఆర్కే తప్పుపడుతున్నారు. దీనిపై స్పందించిన విశ్లేషకులు మాత్రం అది ఆ విమర్శలు చేసేవారి విజ్ఞతకే వదిలెయ్యాలని భావిస్తున్నారు! ఇంకా నయం… కరోనా బాదితుల విషయంలోకూడా పేదల దగ్గర మినహా మిగిలినవారివద్ద మెడికల్ బిల్లులు వసూలు చేయాలన్నారు కాదు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయనుకోండి!

ఈ సమయంలో మరో కొసమెరుపు ఏమిటంటే… జగన్ మాస్కుల పంపిణీ కార్యకరమానికి ఏకంగా… నిజాం పాలనలో వారి దార్శినికత గురించి పోలిక ఎంచుకున్నారు ఆర్కే! నిజాం పాలనలో కరువు కాటకాలు వ్యాపించినప్పుడు ప్రజలకు ఉపాధి కల్పించడానికై హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా ఉన్న హుస్సేన్‌ సాగర్‌ ను తవ్వించారని… “దార్శనికత అంటే అది” అని తెగ మెచ్చేసుకుంటున్నారు! “కోడిగుడ్డుపై ఈకలు” అనడం బావ్యం కాదుకానీ… మాస్కుల విషయంలో ఈ రేంజ్ ఉపన్యాశాలు అవసరామా అనే కామెంట్లు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news