కరోనా మహమ్మారి చిక్కుల నుండి బయట పడేదెప్పుడో…నిజంగా ఈ మహమ్మారి వలన చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే ఇంకా కరోనా కేసులు తగ్గలేదు. చాలా మంది మహమ్మారి వలన సతమతమవుతున్నారు. వేలల్లో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి.
అదే విధంగా వందల్లో మరణాలు కూడా నమోదవుతున్నాయి. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తగా మసులుకోవడం మంచిది. గత 24 గంటల కరోనా వైరస్ అప్డేట్స్ వివరాలలోకి వెళితే… ఇంకా 399436 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
గత 24 గంటల్లో మరో 41678 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30663147 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది.
గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 640 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 422022 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే
వ్యాక్సినేషన్ గురించి చూస్తే… ఇప్పటికి 44 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గత 24 గంటల్లో 4002358 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికి మొత్తం 446156659 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.