సొంత నియోజకవర్గంలో మంత్రికి నిరుద్యోగుల సెగ

-

నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. రోజు రోజుకు వారిలో అసమ్మతి పెరుగుతోంది. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడమే తప్పా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో… నిరుద్యోగుల్లో రోజు రోజుకి అసహనం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా వారి ఆందోళన తీవ్రతను వ్యక్తం చేస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా సొంత నియోజకవర్గంలో మంత్రికి నిరుద్యోగుల సెగ తగిలింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి కాన్వాయ్‌కి ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ సైతం నిలిచిపోయింది. ఇక పోలీసులు విద్యార్థులను తరలించే క్రమంలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. కాగా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేసారు.

కాగా అంతకుముందు మంత్రి హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్గులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… రాష్ట్రంలో ఆక్సిజన్, కరోనా టీకా కొరత లేకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందన్న ఈటల రాష్ట్రానికి వ్యాక్సిన్‌ను ఎక్కువగా సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అయినా ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రాష్ట్రంలో లాక్ డౌన్‌లు, కర్ఫ్యూ, 144 సెక్షన్స్ ఉండవని మంత్రి ఈటల స్పష్టం చేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news