కరోనా కేసుల టెన్షన్..మళ్ళీ కోవిడ్ హాస్పిటల్ గా గాంధీ !

-

తెలంగాణలో పెద్ద ఎత్తున కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ ఆస్పత్రిని చేయనున్నారు. గాంధీ ఆస్పత్రిని రేపటి నుంచి పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. శనివారం నుంచి అవుట్ పేషెంట్స్ ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎలెక్టీవ్స్ కూడా ఆపేసి కేవలం కోవిడ్  కేసులు మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. ఇప్పటికే 450 కి పైగా కరోనా పేషెంట్లు ఉన్నారు.. నిన్న ఒక్కరోజే 150 మంది అడ్మిట్ అయ్యారని అంటున్నారు. 10 నిమిషాలకు ఒక పేషెంట్ అడ్మిట్ అవుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇన్ పేషెంట్ బ్లాక్ మొత్తం ఇప్పటికే కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోయిందని తెలుస్తోంది. దీంతో రేపటి నుంచి ఎమర్జెన్సీ సర్వీస్ లు కూడా ఆపేసి… కేవలం కోవిడ్ హాస్పిటల్ గా ప్రకటించనున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news