దుర్గగుడిలో రెండో రోజూ ఏసీబీ సోదాలు..

-

విజయవాడ దుర్గ గుడిలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 9 గంటల వరకు ఏసీబీ సోదాలు జరపగా అవి పూర్తీ కాలేదు. ఈ రోజు ఉదయాన్నే మళ్ళీ సోదాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. సుమారు నాలుగు బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దుర్గ గుడిలో వెండి సింహాల చోరీ, సెక్యూరిటీ సంస్థ కాంట్రాక్టర్ లు పొడిగింపు పై నివేదిక కూడా కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఆలయంలో ఏళ్ల క్రితం నుంచి పాతుకుపోయిన సిబ్బంది, అంతర్గత బదిలీలలో కూడా చేతులు మారిన సొమ్ము మీద నివేదిక కోరినట్లు తెలుస్తోంది.

అలాగే వేల రూపాయలు విలువ చేసే చీరలు కొట్టేస్తున్న ఆలయ సిబ్బంది వివరాలు కూడా ఏసీబీ నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక రకంగా విజయవాడ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి చెందిన సొంత నగరం కావడంతో ఏసీబీ సోదాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అదీ కాక గతంలో ప్రతిపక్షాలు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద చాలా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏసీబీ సోదాలు ఆసక్తికరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news