విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపింది అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీని ఏకాకిని చేశాయని ఆయన పేర్కొన్నాడు. ఆలయాలపై దాడులు అంశం నుంచి దృష్టి మరల్చేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని టిడిపి వైసిపి తెరమీదకు తెచ్చాయని ఆయన ఆరోపించారు.
స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు. అలాగే ఆలయాలపై దాడులు వ్యవహారాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆలయాలపై దాడులు విషయంలో కూడా వైసిపి టిడిపి రెండు కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు.. నిన్న కూడా ఆయన ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని టిడిపి, కమ్యూనిస్టులు మాత్రమే వ్యాఖ్యానిస్తున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వాస్తవానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని పోస్కో అనే కంపెనీ ప్రతి నిధులు ప్రభుత్వాన్ని కలిశారని కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది.