ఇంటి ముందు ఈ వస్తువులు అస్సలు ఉండకూడదట..!

-

ఇంటిని అందంగా చక్కదిద్దాలని ఎవరికి ఉండదు. అందుకే ఇంటి కోసం రకరకాల వస్తువులు కొని అందంగా ముస్తాబు చేస్తుంటారు. వాస్తుపై నమ్మకం కలిగిన వ్యక్తులు ఇంట్లోని ప్రతి వస్తువు వాస్తు ప్రకారమే తీర్చిదిద్దుతారు. అయితే కేవలం ఇంట్లోనే కాదు.. ఇంటి బయట కూడా వాస్తు ప్రకారం ఉంటేనే ఇంటికి మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటి ముందు ఉండే వస్తువులు వాస్తు ప్రకారం ఉండటమే కాదు.. అసలు కొన్ని వస్తువులు ఇంటి ముందే ఉండకూడదంట. మరి అవేంటో చూడండి..

 

ఇంటి ముందు నిమ్మ చెట్టు ఉండకూడదు. తెల్లవారి లేవగానే ఇంటికి ఎదురుగా ఉన్న గోరింటాకు చెట్టుని చూడకూడదు. తూర్పు వైపు ఆ చెట్లు ఉండొద్దు.. ఈశాన్యంలో ఈ బరువు ఉండకూడదు. ఇలా ఇంటి చుట్టూ కొన్ని వస్తువులు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఇంటి ఎదురుగా ఉండకూడనివి ఉండటం వల్ల ఇంట్లో మనశ్శాంతి ఉండదని వాస్తు పండితులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు స్తంభం నిలబడి ఉండటం శుభప్రదం కాదు. ఇలా జరిగితే ఇంట్లోని స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటి ముందు మెట్లు కట్టకూడదు. ఎందుకంటే ఇది ఇంట్లోని వ్యక్తులకు ఆర్థిక సమస్యలతో పాటు ఉద్యోగం లేదా వ్యాపార పురోగతిలో అడ్డంకులను కలిగిస్తుందట.

ఇల్లు కొనేటప్పుడు లేదా ఇల్లు కట్టేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటి ప్రధాన ద్వారం ముందు చెట్టు ఉండకూడదు. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా చెట్టు ఉంటే ఇంట్లోని వ్యక్తుల పనులన్నింటిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇంటి ప్రధాన ద్వారం ముందు గుడి ఉండడం సరికాదని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గుడి ఉంటే కుటుంబ సభ్యుల జీవితంలో సమస్యలు వస్తాయని వాస్తు పండితుల అభిప్రాయం. వాస్తు నమ్మేవారు వీటిపై ఓ సారి దృష్టి పెట్టండి. నమ్మని వారు ఇలాంటివి ఎలాగూ పట్టించుకోరు కాబట్టి ఎలాంటి సమస్యా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news