ఇండస్ట్రీలో ఇష్టం ఉంటే పడుకుంటారు.. లేకుంటే : రాధా ప్రశాంతి

-

తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్, ఇలా అన్ని చలనచిత్ర పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వ సాధారణమైంది. సినిమాలో ఛాన్స్ రావాలంటే.. పడక సుఖం ఇవ్వాల్సిందేనని ఇప్పటికే చాలామంది తారలు బాహాటంగా చెప్పారు. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు కూడా కమిట్ మెంట్ ఇవ్వకుంటే.. అవకాశం దొరకదు అని చాలామందే చెప్పారు. అయితే తాజా.. నిన్నటి తరం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న రాధా ప్రశాంతి కాస్టింగ్ కౌచ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు రాధా ప్రశాంతి సినిమాలకు పూర్తి దూరంగా ఉంటున్నారు. కాస్టింగ్ కౌచ్ పై ఆమె స్పందిస్తూ .. “ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అప్పుడూ ఉంది .. ఇప్పుడూ ఉంది .. ఇక ముందు కూడా ఉంటుంది. అప్పట్లో ఎవరి తిప్పలు వాళ్లు పడే వారే తప్ప ఈ స్థాయిలో పబ్లిసిటీ చేసుకోలేదు.

ఇప్పుడు ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ రోడ్డెక్కారు అంతే. ఇక్కడ ఎవరూ ఎవరినీ బలవంతం చేయరు .. ఎవరి ఇష్టం వారిది.  కాస్టింగ్ కౌచ్ ఉండటం వల్లనే నాకు అవకాశాలు రావడం లేదు. నన్ను తమ సినిమాల్లోకి పెట్టుకుని కూడా మళ్లీ తీసేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకేసారి నన్ను సెకండ్ హీరోయిన్ గా తీసుకుని .. మేనేజర్ తో అడిగించారు. అందుకు ఒప్పుకోకపోతే తీసేశారు. ఓకే అన్నవారిని పెట్టుకున్నారు. అలా నేను బాధపడిన సంఘటనలు చాలానే ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చారు రాధా ప్రశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news