చిక్కుల్లో సోనూసూద్… రూ. 20 కోట్ల పన్ను ఎగవేత !

రియల్ హీరో సోనూసూద్ ఆస్తులపై ఐటీ శాఖ సోదాలు వరుసగా మూడో రోజులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఐటీ శాఖ అధికారులు… ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ముంబైలోని ఆయన నివాసం తో పాటు…. నాగపూర్ జైపూర్ లలో ఏకకాలంలో ఐటి దాడులు జరిగాయి. అయితే ఈ రియల్ హీరో సోనూసూద్ నివాసంలో గత కొన్ని రోజులుగా చేసిన సోదాలపై ఐటీ శాఖ వివరణ ఇచ్చింది.

sonu sood
sonu sood

సోనూసూద్ ఏకంగా రూ. 20 కోట్ల పన్ను ఎగవేసిన ట్లు ఐటీ శాఖ స్పష్టం చేసింది. వేర్వేరు వ్యక్తులు మరియు సంస్థలు పేరుతో సోనూసూద్ అకౌంట్ లో తాము గుర్తించినట్లు ఐటీ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. సోనూసూద్ అకౌంట్లో చాలావరకు తప్పుడు రుణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ( FCRA ) నిబంధనలను కూడా బాలీవుడ్ స్టార్స్ సోనూసూద్ ఉల్లంఘించినట్లు ఐటీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇంకా సోనుసూద్ ఆస్తులపై దర్యాప్తు జరుగుతోందని… అధికారులు వెల్లడించారు. ఇక ఐటి అధికారుల తాజా ప్రకటనతో… రియల్ హీరో సోనుసూద్ కొత్త చిక్కుల్లో పడ్డారు.