అందాల తార ఆదా శర్మ..‘హార్ట్ ఎటాక్’ మూవీ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే తన అందాలతో కుర్రకారుకు నిజంగానే హార్ట్ ఎటాక్ తెప్పించేసింది ఈ సుందరి. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘సన్ ఆఫ్ సత్య మూర్తి’ సినిమాలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఎప్పుడు కూల్ స్మైల్ తో కనిపించే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో పొట్టి డ్రెస్ ధరించి ఎద అందాలు కనిపించేలా నయా హెయిర్ స్టైల్ తో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది.
ఈ ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘ఆదా అందాలు అదరహో,కొత్త స్టైల్ బాగుంది’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఆదా శర్మ విప్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘క్వశ్చన్ మార్క్ ?’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.