మోహన్‌ బాబు సమక్షంలోనే మనోజ్‌ పెళ్లి.. ఫోటోలు వైరల్‌

-

మంచు మనోజ్ రెండో పెళ్లి వేడుక ఫిల్మ్ నగర్ లోని మంచు నిలయంలో ఘనంగా జరిగింది. భూమా మౌనిక రెడ్డిని పెళ్లాడారు మంచు మనోజ్. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మార్చి మూడవ తేదీన జరిగిన ఈ పెళ్లి వేడుకతో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

ఇద్దరూ కూడా తమ తమ జీవితంలో రెండోసారి ఏడడుగులు వేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అటు మనోజ్, ఇటు మౌనిక ఇద్దరిదీ కూడా రెండో వివాహమే కావడం విశేషం. అయితే, ఈ వివాహానికి మంచు మోహన్‌ బాబు కూడా వచ్చి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news