త్వరలోనే డాక్టర్లు, నర్సింగ్ పోస్టులు భర్తీ : హరీష్‌ రావు ప్రకటన

-

తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ వరంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు. వైద్యశాఖ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ వైద్య విద్యపై దృష్టి పెట్టారని తెలిపారు. అతి త్వరలోనే 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తానని ప్రకటన చేశారు.

అలాగే మరో 13 జిల్లాల్లో డయాగ్నొస్టిక్ సెంటర్ లు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఎంజీఎం లో పిల్లల వార్డులో అందుబాటులోకి తెచ్చానని గుర్తు చేశారు. 13 జిల్లాల్లోనూ పిల్లల వార్డులో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే ఖాళీగా ఉన్న డాక్టర్లు అలాగే నర్సింగ్ పోస్టులు భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు.

తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోడీ సర్కార్ కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, ఎన్ఎంసి నిబంధనల మేరకు నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news