హైదరాబాద్ లో మళ్ళీ కుండ పోత వర్షాలు.. జాగ్రత్త !

-

రెండ్రోజులు గ్యాప్ ఇచ్చిన వర్షాలు హైదరాబాద్‌ లో మళ్లీ దంచి కొడుతున్నాయి. చాలా సేపటి నుండి లక్డీ కపూల్, ఖైరతాబాద్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్‌ ప్రాంతాల్లో లో వర్షం భారీగా పడుతోంది. అమీర్‌ పేట, పంజా గుట్ట, కూకట్‌ పల్లిలో కుండ పోత వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. మేడిపల్లి, అంబర్‌ పేట్, రామంత పూర్, ఘట్‌ కేసర్, మల్లా పూర్‌ ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇక ఇప్పటికే రాబోయే 72 గంటల పాటు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల 9నుంచి 16 సెంటీ మీటర్ల అతి భారీ వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక పురపాలక శాఖా మంత్రి కేటిఅర్ కూడా కీలక ఆదేశాలు జారీ చేసారు. నగరంలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీ చేసి, ఇళ్లను ఖాళీ చేయించాలని జిహెచ్ఎంసి అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news