హుజురాబాద్ బరిలో ప్రధాన పార్టీల దూకుడు.. ఉప ఎన్నిక అప్పుడేనట..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ప్రస్తుతం ఆసక్తిగా హుజురాబాద్ వైపే చూస్తున్నారు. ఒక ఉప ఎన్నికను అధికార పార్టీ ఇంత సీరియస్‌‌గా తీసుకుంటుందని అస్సలు అనుకోలేదని రాజకీయ పరిశీలకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బై పోల్స్‌లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే విక్టరీ చాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్న సంగతి అందరికీ విదితమే. కాగా, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును నియోజకవర్గంతో పాటు రకరకాల ఎత్తుగడలను వేస్తున్నది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కూడా బరిలో ఉండి తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కాగా, ఉప ఎన్నిక ఎప్పుడు ఉండబోతుందనే విషయమ ప్రజెంట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన ఎలా ఉండబోతుంది? ప్రధాన పార్టీలు ఏ రకంగా సమాయత్తమవుతున్నాయనై తదితర విషయాలపై ఇంట్రెస్టింగ్ స్టోరీ.

ఇక ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఆగస్టులోనే వెలువడే అకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, దీంతో పాటు రాష్ట్రంలో ఖాలీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకూ షెడ్యూల్ ప్రకటించే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మెయిన్ పొలిటికల్ పార్టీస్‌కు ఢిల్లీ నుంచి సంకేతాలు అందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్ పదవి కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం ప్రకారం ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న కొవిడ్ మహమ్మారి పరిస్థితుల వల్ల కేంద్ర ఎన్నికల సంఘల పలు ఎన్నికలను పోస్ట్ పోన్ చేసింది. తాజగా పరిస్థితులు చక్కబడ్డాయని అంచనా వేసుకుని అన్నిటికీ ఎలక్షన్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ కమిషన్ త్వరలో ఖాళీగా ఉన్న లోక్‌సభ, ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలన్నిటికీ ఎన్నికలు నిర్వహించనుంది. ఈ జాబితాలో హుజూరాబాద్‌ ఉందనే సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రసర్కారు అభిప్రాయాన్ని ఎలక్షన్ కమిషన్ కోరగా, సీఎస్ సోమేశ్ కుమార్ స్పందన సానుకూలంగా లేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సర్కారుకు ఇప్పుడు సాధ్యపడదని బదులు ఇచ్చిన సంగతి అందరికీ విదితమే. కాగా, టీఆర్ఎస్ పార్టీ సూచన మేరకు ఇలాంటి అభిప్రాయాన్ని సీఎస్ వెల్లడించారని కొందరు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఆశావహులు ఎక్కువ మంది ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, ఆ ఎఫెక్ట్ హుజురాబాద్‌పైన పడొచ్చని సీఎస్ చేత టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రెషర్ చేసి ఈ రకమైన ప్రకటన చేయించి ఉండొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, మొత్తంగా అధికార పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదన్న విషయాన్నిప్రతీ ఒక్కరు గమనించాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news