ఎయిర్‌టెల్‌ సిమ్‌ వాడే వారికి ఈజీగా రూ. 8లక్షల లోన్‌ ఆఫర్..!!

-

ఫేక్‌ లోన్‌ యాప్స్‌ను నమ్మీ చాలామంది అడ్డంగా మోసపోతున్నారు. ఎనిమిది, పది వేలకే లోన్‌ యాప్స్‌ను ఆశ్రయించి.. వాటికి పదిరెట్లు కట్టినా యాప్‌ నిర్వాహకులు వేధిస్తున్నారు.. వాళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో..లోన్‌ తీసుకోవడం చాలా కష్టమైంది.. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మొద్దో తెలియడం లేదు. అయితే..మీకు నిజంగా లోన్‌ కావాలంటే.. ఇది మీకు శుభవార్తే.. అయితే మీరు ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డు యూజరైతే చాలు..! అసలు మ్యాటరేంటంటే..

టెలికం రంగంలోని దిగ్గజ కంపెనీల్లో ఎయిర్‌టెల్ కూడా ఒకటి. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా ఉంది. ఇలా బ్యాంకింగ్ సేవలు కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇంకా పలు కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా రుణాలు కూడా అందిస్తోంది. ఎయిర్‌టెల్ కస్టమర్లు రూ. 8 లక్షల వరకు రుణం పొందొచ్చు. కనీసం రూ. 10 వేల నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడే వారికి మాత్రమే ఈ బెనిఫిట్ వర్తిస్తుంది.

త్వరితగతిన లోన్ అప్రూవల్ లభిస్తుంది. అలాగే 100 శాతం ఆన్‌లైన్ ప్రాసెస్‌… ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. లోన్ అప్రూవల్ తర్వాత 24 గంటల్లో డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి. తర్వాత ప్రతి నెలా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఈఎంఐ కట్ అవుతూ వస్తుంది. ఎయిర్‌టెల్ నేరుగా రుణాలు ఇవ్వదు. ఇది మీడియేటర్‌గా పని చేస్తుంది. ఎయిర్‌టెల్ పలు కంపెనీల భాగస్వామ్యంతో తన యాప్‌లో లోన్ సర్వీసులు ఆఫర్ చేస్తోంది. డీఎంఐ ఫైనాన్స్, మనీ వ్యూ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలతో ఎయిర్‌టెల్ ఒప్పందం చేసుకుంది.

ప్రాసెస్‌ ఏంటి..?

లోన్ పొందాలని భావించే ఎయిర్‌టెల్ కస్టమర్లు ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి.
ఇక్కడ మీరు మీ ఎయిర్‌టెల్ సర్వీసుల గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు షాప్ అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి.
ఇక్కడ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి.
ఇందులో మీకు చాలా ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో మీరు పర్సనల్ లోన్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
తర్వాత మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అవసరం అవుతాయి.
క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి లోన్ అప్రూవల్ ఈజీగా రావొచ్చు. అర్హత కలిగిన వారు సులభంగా లోన్ పొందొచ్చు.
లోన్ అమౌంట్ అనేది మీ ఎలిజిబిలిటీ ప్రాతిపదికన మారుతుంది…
అవసరం ఉన్నవాళ్లు.. అర్హత ఉంటే.. ట్రై చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news