ఇతరుల ఫోన్ కాల్‌ను ట్రాప్ చేయడం, వారు మాట్లాడుకునేది రికార్డ్ చేయడం, చాటుగా వినడం ఇవన్నీ కూడా నేరమే. కానీ టెక్నాలజీ పెరిగింది. జనాలు దీన్ని పనికొచ్చే విషయాల మీద కంటే.. కొంపలుముంచే విషయాలమీదనే ఎక్కువగా ప్రయోగిస్తుంటారు. మీది ఎయిర్‌టెల్ సిమ్ అయితే..జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్‌కాల్స్‌ను ఇప్పుడు ఎరెవరు వింటున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆదమరిచి ఫోన్ పక్కనెట్టేశారో..ఇక అస్సామే.. అసలు ఈ సువర్ణ అవకాశం కేవలం ఎయిర్టెల్ వాడేవాళ్లకే ఎందుకు..? ఇంతకీ ఎలా ఫోన్ కాల్స్‌ను ట్రాప్ చేయొచ్చు.. ఈ వివరాలు తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ వాడే వాళ్ల ఫోన్ కాల్స్‌ను ఎలా ట్రాప్ చేస్తారంటే..
121 నెంబర్‌కి EPREBILL SEP అని టైప్ చేసి మీ జీమెయిల్ ఐడీ టైప్ చేసి మెసేజ్ పంపండి. ఏ నెలలోది కావాలంటే..ఆ నెల JAN/ FEB/MAR ఇలా.
వెంటనే ఆ నెంబర్‌కు పాస్‌వర్డ్ వస్తుంది.
ముందు ఇచ్చిన జీమెయిల్‌కి ఆ నెలలో ఫోన్ కాల్స్ ఎవరెవరితో ఎంతెంత సేపు మాట్లాడారో పీడీఎఫ్ వస్తుంది
ఆ పీడీఎఫ్‌ను ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ ముందే వచ్చి ఉంటుందిగా.. అది ఎంటర్ చేస్తే సెట్. మొత్తం తెలిసిపోతుంది.
కాబట్టి ఎయిర్‌టెల్ సిమ్ వాడేవాళ్లు ఫోన్‌ను ఎక్కడపడితే అక్కడ లాక్ లేకుండా వదిలేస్తే ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఈ పని చేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు. వెంటనే వారి మెయిల్‌కు పంపించుకుని మెసేజ్ డిలీట్ చేశారంటే.. కతమ్. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. కొన్ని ఆఫీస్‌లలో ఫోన్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఫోన్‌కు కచ్చితంగా లాక్ చేసి సైలెంట్‌లో పెట్టి ఇవ్వండి.
ఈ సమాచారాన్ని అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఇచ్చాం కానీ.. ఇప్పుడు మీరు ఇలా చేయోచ్చు అని మీ గర్ల్‌ఫ్రెండ్‌దో, బాయ్‌ఫ్రెండ్‌దో డేటా తీసి అనవసరంగా లొల్లి పెట్టుకుంటారని కాదండోయ్..!