హుద్‌హుద్‌ కి – కరోనాకీ తేడా తెలియదా అఖిలప్రియ?

-

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పెద్దగా ప్రజలకు కనిపించని…. వైకాపా నుంచి టీడీపీలోకి జంప్ చేసి, అనంతరం మంత్రి పదవి కూడా చేపట్టి, అనంతరం ఎన్నికల్లో “గోపీ” (గోడమీద పిల్లులు) లకు అందరికీ జరిగిన శాస్తిలో భాగంగా ప్రస్తుత మాజీ మంత్రిగా ఉన్న అఖిల ప్రియ… కరోనా సమయంలో మాత్రం వరుసపెట్టి మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. వితౌట్ లాజిక్ ఒక నాలుగు మాటలు జగన్ ని అనేసి మళ్లీ కనుమరుగైపోతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరోసారి మైకందుకున్నారు అఖిల ప్రియ!

ఒకపక్క కర్నూలులో ఎందుకు కేసులు పెరుగుతున్నాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నిస్తుంటే… కర్నూలులో కేసులు దాచిపెడుతున్నారని అఖిల ప్రియ చెప్పుకొస్తున్నారు. అవును… కరోనా పాజిటివ్ కేసులు ఏమైనా డబ్బులా దాచుకోవడానికి అని ఒకపక్క ప్రభుత్వం చెబుతున్నా… దాచినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజినామా చేస్తామని మంత్రులు ఛాలెంజ్ లు విసురుతున్నా… ఈ చిల్లర ఆరోపణలు మాత్రం టీడీపీ నేతలనుంచి రావడం తప్పడం లేదు! ఇందులో భాగంగా హుద్ హుద్ తుఫానునీ, కరోనా ని కలిపి చంద్రబాబుని పొగడటానికి ఒక పథకం రచించారు అఖిల ప్రియ!

కర్నూలు జిల్లాలో లాక్‌డౌన్‌ సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని, అదే నిజమైతే కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. భారతదేశ వ్యాప్తంగా కూడా లాక్ డౌన్ పక్కాగా అమలవుతుంది… అయినా కూడా అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయిగా… అనేది వినిపిస్తున్న సమాధానం! అది అలా ఉంచితే… గతంలో విశాఖలో హుద్‌హుద్‌ తుఫాను వచ్చినప్పుడు ప్రజలకు ధైర్యం చెప్పేందుకు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు అక్కడే ఉండి చర్యలు తీసుకున్నారని… అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్‌ కర్నూలులో మకాం వేసి కరోనా కేసులు పెరగటానికి గల కారణాలు వెలికి తీసి రాయలసీమ ప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పాలని ఆమె కోరారు.

ఈమాత్రం పనిచేయడానికి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే రావాల్సిన అవసరం లేదు… బాధ్యత కలిగిన ఏ రాజకీయనాయకుడు అయినా పర్లేదు. ఆఖరికి అఖిల ప్రియ అయినా పర్లేదు. జనం ఓట్లు వెయ్యకపోతే కనీసం ఓదార్చడానికి కూడా వెళ్లరా? ఇంతోటి దానికి సీఎం దిగిరావాలా? అవసరం లేదు అఖిలా? కుప్పం ప్రజలు కూడా సీఎం రావాలని కోరుకోవడం లేదు… వాళ్ల ఎమ్మెల్యే వస్తే చాలని అనుకుంటున్నారు అంతే! ఈయన సీఎంగా ఉంటే వైజాగ్ వెళ్తారు తప్ప… ఆ పదవి కాస్త పోతే కనీసం కుప్పం కూడా వెళ్లరా… హతవిధీ!

ఇక్కడ అఖిల ప్రియ గ్రహించలేని సంగతి ఏమిటంటే… హుద్ హుద్ తుఫాను అనేది ఒక జిల్లాలో, ఒక ప్రాంతంలో ఉంటుందని తెలుసు కాబట్టి… రాజధానిలో ఉండి పరిపాలనను పక్కగా అమలుచేసే సామర్ధ్యం లేకో మరెందుకో కానీ బాబు అక్కడికి వెళ్లారు.. దానివల్ల ప్రత్యేకంగా ఒరిగిందేమిటో అఖిల ప్రియకే తెలియాలి! ఇక కరోనా అనేది రాష్ట్రం మొత్తం పాకిన సమస్య! అలాంటప్పుడు జగన్ ఒక్క కర్నూలు లోనో, వైజాగ్ లోనో, గుంటూరు లోనో, నెల్లూరులోనో ఉండే పరిస్థితి ఉండదు అని! ఒకవేళ జగన్ బయటకు వస్తే… జగన్ కు ఒక రూలు, ఇలాంటి చిన్న చిన్న లాజిక్కులు సైతం మరిచిపోయి అఖిల ప్రియ మైకుల ముందుకు రాకుండా.. కాస్త బాగా ప్రిపేర్ అయ్యి రావాలని పలువురు అభిమానులు ఆమెకు సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news