పాస్‌వర్డ్‌ ఎవరు లీక్ చేసారు…? హైకోర్ట్ సీరియస్…!

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదం ఇప్పట్లో ముగిసే అవకాశం కనపడటం లేదు. దీనిపై నిన్న హైకోర్ట్ విచారణ జరిపింది. ఈ రోజు కూడా దాన్ని కొనసాగించి ఆన్ లైన్లో విచారణ జరుపుతుంది. కరోనా కారణంగా ఈ కేసు విచారణ మొత్తం ఆన్లైన్ లోనే జరిగింది. ఈ కేసులో పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులకు ఓ పాస్‌వర్డ్‌ ఇచ్చి ఆన్ లైన్ ద్వారా విచారణ చేస్తుంది కోర్ట్.

ఈ రోజు తీర్పు ఇవ్వాలి అని భావించింది కోర్ట్. కాని ఒక ఊహించని పరిణామ౦ జరిగింది కోర్టులో. విచారణ జరుగుతున్న సమయంలో వాస్తవానికి 10 మంది మాత్రమే ఆన్ లైన్లో ఉండాల్సి ఉండగా, సుమారు 40 మంది ఆన్ లైన్లో కనపడటం తో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేసి మండిపడ్డారు. కేవలం 10 మందికి మాత్రమే పాస్‌వర్డ్‌ ఇస్తే, ఇంత మంది ఎలా వచ్చారని నిలదీశారు. పాస్‌వర్డ్‌ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతోందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఇలా కాదు గాని ఇక కోర్ట్ లోనే విచారణ చేస్తామని పేర్కొన్నారు. కొందరు న్యాయవాదులు హైదరాబాద్ నుంచి కూడా రావాల్సి ఉందని చెప్పగా… చీఫ్ జస్టీస్ స్పందిస్తూ వాదనలు వినిపించే లాయర్లకు పాస్ లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీలకు తాము లేఖలు రాస్తామని పేర్కొంది. ఏపీ డీజీపీకి కోర్టు సిబ్బందే స్వయంగా వెళ్లి అందజేస్తారని పేర్కొంది. కేసు విచారణ సోమవారానికి వాయిదా వేసారు.

Read more RELATED
Recommended to you

Latest news