ఇటీవలే రక్షాబంధన్, కట్ పుత్లి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ మరో సరికొత్త సినిమాతో త్వరలో థియేటర్ లోకి రానున్నారు. అక్షయ్ కుమార్, సత్యదేవ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలో రూపొందిన మూవీ ‘రామసేతు’ టీజర్ రిలీద్ అయింది. దీపావళి పురస్కరించుకుని అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
టీజర్ లో అక్షయ్ కుమార్ ‘రామసేతు’ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. అక్షయ్‌కు సత్యదేవ్, జాక్వెలిన్‌లు సహకరిస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. రామసేతును రక్షించడం కోసం ఒక పెద్ద రోబెటిక్ సబ్‌మెరైన్ సాయంతో అక్షయ్ కుమార్ సముద్ర గర్భంలోకి వెళ్లడం అక్కడ ఓ దీవిని కనుగొనడం వంటి సీన్స్‌ను ఇందులో కనిపించాయి. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహించారు.