సంక్రాంతి ఎఫెక్ట్..ఏపీలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు..ఎంతంటే !

-

ఏపీలో మద్యం సేల్స్‌ భారీగా పెరిగిపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో మద్యం కిక్కు మరింత పెరిగింది. పండుగ సీజన్ కావడంతో మద్యం విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది.

సంక్రాంతి పండుగకు ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే బాగానే తాగేశారు మందుబాబులు. దీంతో మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. గత మూడు రోజుల్లో ఏకంగా రూ.214 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2.23 లక్షలకు పైగా లిక్కర్, 83 వేలకు పైగా బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news